Siddipet: నేరాల నియంత్రణకు సురక్ష నేత్ర.. పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన!
Siddipet: సిద్దిపేట జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సురక్ష నేత్ర' ప్రాజెక్ట్ సరికొత్త మైలురాయిని అందుకుంది.
Siddipet: నేరాల నియంత్రణకు సురక్ష నేత్ర.. పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన!
Siddipet: సిద్దిపేట సురక్ష నేత్ర' కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 270 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం రావురుకుల గ్రామంలో ఏర్పాటు చేసిన 27 సీసీటీవీ కెమెరాలను,
అలాగే దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఏర్పాటు చేసిన 32 సీసీటీవీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపీ మాట్లాడుతూ.. 'సిద్దిపేట సురక్ష నేత్ర' ప్రాజెక్ట్ ప్రారంభించిన 100 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను విజయవంతంగా ఏర్పాటు చేసి, ప్రారంభించుకోవడం విశేషమన్నారు.
Next Story




