Siddipet: రాష్ట్రస్థాయి కళా ఉత్సవంలో సిద్దిపేట టీచర్ల మెరుపులు!
Siddipet: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల వికాస కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
Siddipet: రాష్ట్రస్థాయి కళా ఉత్సవంలో సిద్దిపేట టీచర్ల మెరుపులు!
Siddipet: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విద్య వారోత్సవా లలో భాగంగా రాష్ట్రస్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల చెన్నారెడ్డి మానవ వనరుల వికాస కేంద్రంల హైదరాబాదులో నిర్వహించడమైనది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నుండి 1.డా.ఎండి సాదత్ అలీ ఎస్సే ఫిజికల్ సైన్స్ జడ్పీహెచ్ఎస్ ధర్మాజీపేట.పబ్బోజు రాజమౌళి ఎస్సై ఫిజికల్ సైన్స్ జడ్పీహెచ్ఎస్ అయినా పూర్, దేవులపల్లి కిష్టయ్య ఎస్సీ సోషల్
యుపిఎస్ బెక్కల్.సిద్దిపేట జిల్లా నుండి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అంశమే ధ్యేయంగా కథానిక మరియు నృత్య రూపకంగా ప్రదర్శించిన కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కేశవరావు గారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రానా గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నవీన్ నికోలస్ గారు పూర్వ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన గారు ఎస్ సి ఈఆర్ టి డైరెక్టర్ రమేష్ గారు పాల్గొన్నారు . ఉపాధ్యాయులు ప్రదర్శించిన ప్రదర్శనని అభినందించారు.




