Siddipet: హరీష్ రావుకు అయ్యప్ప ఆలయ మహా కుంభాభిషేక ఆహ్వాన పత్రిక
Siddipet: సిద్దిపేట అయ్యప్ప ఆలయం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 19 నుండి మహా కుంభాభిషేకం; మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత.
Siddipet: హరీష్ రావుకు అయ్యప్ప ఆలయ మహా కుంభాభిషేక ఆహ్వాన పత్రిక
సిద్దిపేట: సిద్దిపేట పట్టణం లో అయ్యప్ప దేవాలయం లో వచ్చే నెల 19 నుండి జరిగే మహా కుంబాభిషేక మహోత్సవ సందర్బంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారికి ఆహ్వాన పత్రిక ను ఆలయ కమిటీ సభ్యులు అందజేసారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ,సిద్దిపేట అయ్యప్ప దేవాలయం నిర్మించి 25 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్బంగా నిర్వహించే మహా కుంబాభిషేకం లో సిద్దిపేట పట్టణ ప్రజలు అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని హరీష్ రావు గారు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.




