Siddipet: తొగుటలో సబ్సిడీ జీలుగ, జనుము విత్తనాల పంపిణీ
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సబ్సిడీ జీలుగ, జనుము విత్తనాల పంపిణీ ప్రారంభమైంది.
Siddipet: తొగుటలో సబ్సిడీ జీలుగ, జనుము విత్తనాల పంపిణీ
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో రైతులకు జీలుగ,జనుము సబ్సిడి విత్తనాలను అందజేసిన తొగుట AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) గారు. తదనంతరం వారు మాట్లాడుతూ జీలుగ విక్రయ ధర 1 కేజీ రూపాయలు 163.50 సబ్సిడి 81.75 రైతు చెల్లించాల్సిన రూపాయలు 81.75 , 3O కేజీ బ్యాగ్ ధర 2452, జనుము విక్రయ ధర ప్రతి కేజీ కి 155.50 సబ్సిడీ 77.75 రైతు చెల్లించాల్సిన ధర 77.75 ,40 కేజీ బ్యాగ్ ధర 3110.00 పచ్చి రొట్ట ఎరువులు అందిస్తున్నారు కావున రైతులు సద్వినియోగం చేసుకోగలరు.. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొంగరి నర్సింలు, స్థానిక సర్పంచ్ శోభ కొండల్ రెడ్డి, AO మోహన్ గారు,డైరెక్టర్ ఆన్సర్, గ్రామ పార్టీ అధ్యక్షులు భరత్ తేజ, నాయకులు, రైతులు లక్ష్మారెడ్డి సుధాకర్ రెడ్డి, ఎల్ల రెడ్డి, నాగరాజు, వంశీ రెడ్డి, పోచయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.




