Siddipet: సిద్దిపేట ప్రజలకు సీఎం సభ వల్ల ఒరిగిందేమీ లేదు: కొండం సంపత్ రెడ్డి!

Siddipet: సిద్దిపేట సీఎం సభ వల్ల జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, రూ.1,070 కోట్ల పెండింగ్ పనులపై హామీ ఇవ్వలేదని శుక్రవారం కొండం సంపత్ రెడ్డి విమర్శించారు.

RAJU, SIDDIPET
Published on: 20 Nov 2026 5:27 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట ప్రజలకు సీఎం సభ వల్ల ఒరిగిందేమీ లేదు: కొండం సంపత్ రెడ్డి!

సిద్దిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎగవేతల రేవంత్ రెడ్డి నిన్నటి పర్యటన వల్ల జిల్లా ప్రజలకు. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంత వాసులకు ఓనగూరిన లాభం ఏమి లేదని, సీఎం కూర్చి స్థాయి దిగజార్చి అవే రోత, చిల్లర మాటలు మాట్లాడినట్టు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి విమర్శించారు. ఈరోజు జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ గడ్డ సిద్దిపేట లో బహిరంగ సభకు 12నియోజకవర్గ పరిధిలోని ప్రజలను తరలించారు.

అయినప్పటికీ సీఎం సభ అట్టర్ ప్లాప్ అయిందని.16ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు చేసిన 30వేల మంది కూడా లేరన్నారు.. వారిలో సగం మంది పార్టీ వాళ్లే ఉన్నారు.. కేసీఆర్ ను వెన్నుపోటు అని విమర్శించిన సీఎం తీరు హాస్యాస్పదంగా ఉంది.

తెలంగాణ ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంలో వివక్షను దూరం చేసిన కేసీఆర్ ను ఊసరవెల్లి లెక్క మూడు పార్టీలు మారిన సీఎం విమర్శలు చేయడం విడ్డురంగా ఉంది.. చంద్రబాబు కనుసన్నల్లో నడిచే రేవంత్ రెడ్డి ఆంద్ర ప్రయోజనాలకు అనుగుణంగా నీటి వాటా అడగడంతో పూర్తిగా వైఫల్యం చెందినది తెలంగాణ ప్రజలకు తెలుసు.. అసెంబ్లీలో చర్చ అని సవాల్ చేసి సమావేశాల్లో బీఆర్ఎస్ నిలదీసే అవకాశం లేకుండా ఏదో సాకుతో సస్పెండ్ చేయడం నీకు కొత్తకాదు.. రాజకీయాల కోసం మాజీ మంత్రి మదన్ మోహన్ పేరును వాడుకుంటున్నావ. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో 10 ఏండ్లుగా కాంగ్రెస్ ఉంది. అప్పుడు ఒక్కరోజు కూడా మదన్ మోహన్ విగ్రహాన్ని పెట్టాలనే సోయి లేని పార్టీ మీది.

మాజీ మంత్రి హరీష్ రావు జిల్లా కేంద్రంలో మదన్ మోహన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సహకారాన్ని అందించారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి పెద్ద విగ్రహ ఏర్పాటు జరిగింది.

మదన్ మోహన్ పట్ల చిత్తశుద్ధి మీకు ఉందా. బీఆర్ఎస్ కు ఉందా చెప్పాలి... మేము కట్టినమెడికల్ కళాశాలకు మదన్ మోహన్ పేరు పెట్టడం కాదు... దమ్ము, దైర్యం ఉంటే నీవు కొడంగల్ ఎత్తికుపోయిన వెటర్నరీకళాశాల ను మళ్ళీ తెచ్చి దానికి మదన్ మోహన్ పేరు పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకో.. అనుకోకుండా సీఎం అయ్యావు.. సిద్దిపేట లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా అని రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడు...సిద్దిపేట ప్రజలే తన కుటుంబం లెక్క అనుబంధం ఉన్న హరీష్ రావును సిద్దిపేట ప్రజలు ఆదరిస్తున్నారు.

దానికి చరిత్ర తిరిగింది వెనక్కి వెళ్ళి చూసుకో సిద్దిపేట లో సీఎం సభ అంటే ఈ ప్రాంతానికి చెందిన ప్రజల్లో ఎన్నో ఆశలు పెరిగాయి...1070 కోట్ల పెండింగ్ పనుల గూర్చి ఒక్క హమీ ఇవ్వలేదు. వచ్చిన ఒర్రిన పోయిన అన్నట్టు సీఎం అట్టర్ ప్లాప్ అయింది.

ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ వరాల సురేష్, వంగ తిరుమల్ రెడ్డి, లవ్లీ సాయి RTA మెంబెర్ ఇర్షాద్, BRS నాయకులు బత్తిని శ్రీను, బదనాపురం రాజు తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET