Siddipet: ఐకేపీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కాంగ్రెస్ నాయకులు

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆకస్మిక తనిఖీ.

Chindam Karunakar, Dubbak
Published on: 4 Jun 2026 6:44 PM IST
Siddipet
X

Siddipet: ఐకేపీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కాంగ్రెస్ నాయకులు

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కపూర్ గ్రామంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హామాలీల కొరత లేకుండా చూడాలని, ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ,

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉందని రైతులకు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఏపీఎం, తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, తుక్కాపూర్ సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మండల ప్రధాన కార్యదర్శి చిక్కుడు ఉప్పలయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్నం భూపాల్ రెడ్డి, కూచి మహిపాల్ రెడ్డి, భరత్ తేజ, స్వామి, సోలిపేట ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story