Siddipet: నవంబర్ 22న హైదరాబాద్‌లో యూత్ కాన్ఫరెన్స్
Siddipet: దేశానికి యువతే వెన్నుముక అని, ఈ నెల 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్న యూత్ కాన్ఫరెన్స్ పోస్టర్‌ను సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో విడుదల చేశారు.
Siddipet: నవంబర్ 22న హైదరాబాద్‌లో యూత్ కాన్ఫరెన్స్
సిద్దిపేట: దేశానికి యువత అతి ముఖ్యమైన సోర్స్ అని ఇడియల్ యూత్ మూవ్మెంట్ తెలంగాణ సభ్యులు వహీద్, ఖుద్ధుస్ తెలిపారు. సోమవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ యువత భారత దేశానికి వెన్నుముక అన్నారు. అలాంటి యువత సరైన దారిలో ప్రయాణిస్తే దేశ భవిష్యత్తు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని అన్నారు.
తమ సంస్థ ఆధ్వర్యంలో యువతను సరైన దారిలో ప్రయాణించే విధంగా, డ్రగ్స్, సైబర్ నేరాలు, జూదం లాంటి విషయాలపై అవగాహనా కల్పిస్తున్నామన్నారు. భారత దేశం యువత లో అనేక టాలెంట్స్ ఉన్నాయని వాటిని వెలికి తీసి సరైన పద్దతిలో వాడుకుంటే తప్పకుండ దేశం అభివృద్ధి దిశగా సాగుతుందని డానికి అనుగుణంగా తాము IYM లాంటి ప్లాట్ఫార్మ్ సిద్ధం చేశామన్నారు.
లక్ష్యం లేని ప్రయానం ఎన్ని అనర్తలకు దారి తీస్తుందో యువతకు తెలిసేలా చేయడమే తమ లక్ష్యం అన్నారు. స్థిరమైన సొసైటీ, నేరం లేని సమా నిర్మాణం కోసం ఈ నెల 22 న హైదరాబాద్ లో భారీ ఎత్తున యూత్ కాన్ఫరెన్స్ నిర్వజిస్తున్నామని తెలంగాణ యువత పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సభ్యులు అబ్దుల్ ఖుద్ధుస్, వహీద్,హాజీ సిద్ధిక్ అతిఫుద్దీన్, హబీబుద్దీన్, అమీర్,మిస్కిన్, మొహమ్మద్ కరీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.




