Akbarpet: ఈసారి సన్న వడ్లు పండిస్తేనే లాభం.. తాళ్లపల్లి సభలో కీలక సూచనలు!
Akbarpet: అక్బర్‌పేట భూంపల్లి మండలం తాళ్లపల్లిలో ప్రత్యేక గ్రామసభ. సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచన.
Akbarpet: ఈసారి సన్న వడ్లు పండిస్తేనే లాభం.. తాళ్లపల్లి సభలో కీలక సూచనలు!
Akbarpet-Bhumpally: అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో ప్రత్యేక గ్రామసభను గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్‌గా మండల వ్యవసాయ అధికారి సత్యాన్వేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్, మండల వ్యవసాయ అధికారి సత్యాన్వేష్ మాట్లాడుతూ రైతులు రాబోయే వర్షాకాల సీజన్‌లో సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందున సన్న వడ్లకు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు.
వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామ ప్రజలు పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే జూలై 25వ తేదీ నుండి కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టనున్న SIR (Special Intensive Revision) ప్రక్రియలో ప్రతి అర్హులైన పౌరుడు తన ఓటును నమోదు చేసుకోవాలన్నారు.




