Siddipet: కేసీఆర్ వందేళ్లు ఆయురారోగ్యాలతో బ్రతకాలి: మల్లన్నకు పూజలు

Siddipet: మాజీ సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో వందేళ్లు జీవించాలని సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో యాదవ, గొల్ల కురుమలు పెద్దపట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 13 Sept 2026 5:11 PM IST
Siddipet
X

Siddipet: కేసీఆర్ వందేళ్లు ఆయురారోగ్యాలతో బ్రతకాలి: మల్లన్నకు పూజలు

సిద్దిపేట జిల్లా: కొమురవెళ్లి లోని ప్రసిద్ధ మల్లన్న స్వామి ఆలయంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్యంగా, చల్లగా వందేళ్లు జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర యాదవ సామాజిక వర్గం, స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

గత కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళిత సంఘాలు చావుడప్పు కొట్టిన ఘటనతో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచ రంగులతో 21 వరుసల రంగవల్లి (పెద్దపట్నం) రచించి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.

నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని మల్లన్న స్వామికి ముడుపు కట్టి మొక్కుబడి తీర్చుకున్నారు. ఆ మొక్కుబడి నెరవేరిన నేపథ్యంలో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్లు చల్లగా, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రంలో పాడి, పంటలు, సాగునీరు, తాగునీటి ఎద్దడి లేకుండా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.

గొల్ల కురుమల మరియు యాదవ సామాజిక వర్గం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం ఆర్థికంగా మరియు సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు పోచబోయిన శ్రీహరియాదవ్. రాజరామ్ యాదవ్.కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సెవెళ్ల సంపత్ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL