Cheryal: చేర్యాలలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇళ్ల మధ్య నిలిచిన డ్రైనేజి నీరు!

Cheryal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిలిచిన వర్షపు నీరు, డ్రైనేజి మురుగు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 25 Sept 2026 10:43 AM IST
Cheryal
X

Cheryal: చేర్యాలలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇళ్ల మధ్య నిలిచిన డ్రైనేజి నీరు!

Cheryal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలోని 6వ వార్డులో ఇటీవలే సీసీ రోడ్డు వేశారు కానీ వర్షం పడ్డప్పుడు నీరు బైటకు వెళ్ళడానికి అడ్డంగా పైపులు వేయాల్సి ఉంది. పైపులు తెచ్చి వేయడం మరిచారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన కాలనీలో ఇళ్ల మధ్యనే వర్షపు నీటి తో పాటు డ్రైనేజి నీరు చెత్త చేదారం నిలవడంతో కాలనీ వాసుల తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు.

నీరు నిల్వడం తో దుర్గంధం వెదజల్లడంతో పాటు పాములు తేల్లు ఇతర విష పురుగుల వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అవగాహనా లేని కాంట్రాక్టర్ పనులు చేస్తే ఇలానే ఉంటుందని దీనికి తోడు సంబంధిత అధికారులు కాసుల కాసులకు కక్కుర్తి తో పర్యవేక్షణ కౌరవుతుందని స్థానికులు మండిపడుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పాలకులు సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL