Dubbaka: దుబ్బాకలో కోతులు, వీధి కుక్కల బెడద!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కోతులు, వీధి కుక్కల బెడదతో వాకర్లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామసముద్రం కట్ట పరిసరాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
Dubbaka: దుబ్బాకలో కోతులు, వీధి కుక్కల బెడద!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కోతులు, వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పట్టణంలోని రామసముద్రం కట్ట పరిసర ప్రాంతాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు వందల సంఖ్యలో కోతులను తీసుకొచ్చి పట్టణ శివార్లలో వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో కోతులు పట్టణంలోని నివాస ప్రాంతాల్లోకి చేరుకుని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.ఇళ్లపై ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కోతులు కనిపిస్తుండటంతో చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
పిల్లలను ఒంటరిగా బయటకు పంపించలేని పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులే పిల్లల వెంట వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే మరోవైపు వీధి కుక్కల బెడద కూడా ప్రజలను కలవరపెడుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తీసుకొచ్చి పట్టణంలో వదిలేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.




