Godugupally: అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: వనజ స్వామి!
Godugupally: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లిలో సర్పంచ్ మద్దెల వనజ స్వామి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
Godugupally: అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: వనజ స్వామి!
Godugupally: గొడుగుపల్లి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేయాలని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి అన్నారు.
గొడుగుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ మద్దెల వనజ స్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను, ఆయన చేసిన సామాజిక సంస్కరణలను స్మరించుకున్నారు.
అంబేద్కర్ తన జీవితమంతా సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో పోరాటం చేశారని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన అంబేద్కర్, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారని తెలిపారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిందన్నారు.




