Thoguta: తొగుటలో 50 శాతం సబ్సిడీపై కంది విత్తనాల పంపిణీ
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుటలో MANP పథకం కింద 50% సబ్సిడీపై రైతులకు కంది విత్తనాలు పంపిణీ. ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారుల సూచన.
Thoguta: తొగుటలో 50 శాతం సబ్సిడీపై కంది విత్తనాల పంపిణీ
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట రైతు వేదికలో రైతులకు MANP పథకంలో భాగంగా (Mission for aatma Nirbharatha in pulses ) 50%సబ్సిడీపై కంది విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సబ్సిడీ విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి , తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్ ),సొసైటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డి, వ్యవసాయ అధికారి మోహన్, వ్యవసాయ విస్తరణ అధికారి రవళి,రైతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులకు పంట మార్పిడి విధానం పాటించాలని ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని తెలియజేయడం జరిగింది. సబ్సిడీ విత్తనాలు పొందుటకు రైతు సోదరులు వారి గ్రామాల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను పట్టాదార్ పాసుబుక్ మరియు ఆధార్ కార్డుతో సంప్రదించగలరు.
Next Story




