Siddipet: గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Siddipet: గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కొంతమంది భూ నిర్వాసితులు సుప్రీంకోర్టులో వేసిన కేసులతో పాటు ఎన్జిటి, వనశక్తి కేసుల కారణంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.
రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులో ఉంటాయని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో 95% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఇరవై వేల ఎకరాలకు పైగా సాగునీరు అంది హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం కానుంది.
ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో సుప్రీంకోర్టులో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించి మార్గం సుగమమైందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజా పాలన ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వామని గుర్తు చేశారు.




