Mirudoddi: స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తల ప్రశిక్షణ

Mirudoddi: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో కార్యకర్తల శిక్షణ తరగతులు.

Chindam Karunakar, Dubbak
Published on: 28 May 2026 9:10 AM IST
Mirudoddi
X

Mirudoddi: స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తల ప్రశిక్షణ

Mirudoddi: స్వదేశీ జాగరణ మంచ్ సిద్దిపేట జిల్లా కార్యకర్తల ప్రశిక్షణా వర్గ మిరుదొడ్డి లో జరిగింది.ఈ వర్గ లో దక్షిణ మధ్య క్షేత్ర సంయోజక్ ప్రొఫెసర్ సత్తు లింగమూర్తి మార్గదర్శనం చేశారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత దేశ కాల పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తమ దేశ భక్తి గుండెల్లో పెట్టుకుంటే మాత్రమే సరిపోదు అది ప్రకటితం అయ్యేటట్లు గా జీవించాలి అన్నారు. మనం ఉదయం లేచిన దగ్గరి నుంచి నిద్రపోయే వరకు బ్రాండెడ్ మోజులో పడి విదేశీ వస్తువులనే కొనుగోలు చేస్తున్నాము. దీనివల్ల దేశం ఆర్థికంగా బలహీనమవుతున్నది.ఆంగ్ల భాషలో మాట్లాడితేనే మేధావి అనే రోజుల్లో మనం జీవిస్తున్నాం, దీనివల్ల కూడా మనం మన మాతృభాష ను మరిచ్చిపోతున్నాం. కాబట్టి మనదైన భాష, సంస్కృతి ని కాపాడుకోవలసిన అవసరం ఈనాడు దేశంలో ఏర్పడింది.రాబోయే సంవత్సరం మొత్తం భారతీయులుగా ఉందాం, భారతీయ వస్తువులనే కొందాం అనే జీవన విధానం తో ముందుకు వెళ్లాలని ఈ ఆలోచన సామాన్య ప్రజల వరకు తీసుకెళ్లాలని అన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story