Siddipet: డీఎన్‌టీఎఫ్‌ఎన్‌టీ జాబితాలో పూసల కులం చేర్పు చారిత్రాత్మక నిర్ణయం
Siddipet: పూసల కులాన్ని డీఎన్‌టీ-ఎన్‌టీ (DNT-NT) జాబితాలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.
Siddipet: డీఎన్‌టీఎఫ్‌ఎన్‌టీ జాబితాలో పూసల కులం చేర్పు చారిత్రాత్మక నిర్ణయం
Siddipet: తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతుల సంక్షేమం, సామాజిక న్యాయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా పూసల కులాన్ని డీఎన్‌టీఎఫ్‌ఎన్‌టీ (డీనోటిఫైడ్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్) జాబితాలో చేర్చడం పట్ల సిద్దిపేట జిల్లా పూసల సంఘం జిల్లా మాజీ ఉపాధ్యక్షులు దౌల్తాబాద్ ముదరకోళ్ల యాదగిరి హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నో దశాబ్దాలుగా సామాజిక గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న పూసల వర్గ ప్రజలకు ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మక మలుపుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ, పూసల కులానికి ప్రత్యేక గుర్తింపు కల్పించాలనే డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోందన్నారు. సమాజంలోని వెనుకబడిన, సంచార జీవనం సాగించే అనేక కుటుంబాలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పారు.




