Dubbaka: అభివృద్ధి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే అభివృద్ధి

Dubbaka: నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1 కోటి 96 లక్షల నిధులు మంజూరు చేసింది.

Chindam Karunakar, Dubbak
Published on: 14 Jun 2026 10:17 AM IST
Dubbaka
X

Dubbaka: అభివృద్ధి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే అభివృద్ధి

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, రాయిపోల్, దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్‌పేట భూంపల్లి, దౌల్తాబాద్ మండలాల్లోని పలు గ్రామాలలో MGNREGS ఆధ్వర్యంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ అభివృద్ధి పనుల కోసం రూ.1.కోటి 96 లక్షల నిధులు మంజూరు కావడం హర్షణీయం.

ఈ నిధుల మంజూరుకు సహకరించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నాము.దుబ్బాక అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజా సంక్షేమమే మా ధ్యేయం!

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story