Daultabad: తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కొరకు పరిశీలన..
Daultabad: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లో రూ. 24 కోట్ల వ్యయంతో అత్యాధునిక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు.
Daultabad: తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కొరకు పరిశీలన..
Daultabad: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు బలోపేతం చేయడమే లక్ష్యంమని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సిద్థిపేట జిల్లా దౌల్తాబాద్ లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ 24 కోట్ల వ్యయం తో మంజూరు అయ్యిందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక అంతర్జాతీయ సదుపాయాలతో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు సెమీ రెసిడెన్సియల్ పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు.
ఆయనతో పాటు ఎడ్యుకేషన్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ సెక్టోరియల్ అధికారి రామస్వామి, మండల విద్యాధికారి గజ్జల కనక రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మండల అధ్యక్షుడు పడాల రాములు, స్థానిక సర్పంచ్ ముచ్చమర్రి అనురాధ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Next Story




