Siddipet: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగ్యాపల్లి తండాలో అప్పుల బాధతో బానోతు రాములు (42) అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
Siddipet: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం లింగ్యాపల్లి తండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. లింగ్యాపల్లి తండాకు చెందిన బానోతు రాములు (42), తండ్రి భంగ్య రాములకు భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల పెద్ద కుమార్తె వివాహం జరగడంతో కుటుంబం పై ఆర్థిక భారం పెరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పుల ఒత్తిడి, కుటుంబ సమస్యల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన రాములు, తాను కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిలోని మర్రిచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కొంత సేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి స్థానికులకు సమాచారం అందించగా గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




