Siddipet: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఏఎంసీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఐకేపీ (IKP) ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 20 May 2026 4:50 PM IST
Siddipet
X

Siddipet: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఏఎంసీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

Siddipet: సిద్దిపేట జిల్లతొగుట మండలంలోని జప్తి లింగారెడ్డిపల్లి, వెంకట్రావుపేట, చందాపూర్, రాంపూర్, తొగుట హెడ్ క్వార్టర్,తుక్కపూర్ గ్రామాలలో AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) స్థానిక అధికారులతో కలసి సుడిగాలి తనిఖీ చేసి నేరుగా రైతులతో ఐకెపి సెంటర్లను సందర్శించారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీ జెండాలు పట్టుకోండి ఇప్పుడు జెండాలు అని పక్కన పెట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ధాన్యం గింజను కొనుగోలు కేంద్రాలలో రైతుల జెండా పట్టుకొని.

రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాలని కోరారు లారీల కొరతతో వడ్లు ఆలస్యం అవుతుంది అని రైతులు తమ దృష్టికి తెచ్చారు. వెంటనే జిల్లా పోలీస్ రెవెన్యూ అధికారులతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు,మీ మీ గ్రామలలో ఉన్న డీసీఎం ద్వారా వడ్లను పంపిస్తే మిల్లుల వద్ద దింపించే బాధ్యత నాది అని చెప్పారు.కార్యక్రమంలో AMC మార్కెట్ కోపరేటివ్ కమిటీ కార్యదర్శి స్వామి,సునీల్, సర్పంచులు రవీందర్,పాగాల శోభా కొండల్ రెడ్డి పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story