Thoguta: తొగుట మండలానికి రూ.1.40 కోట్ల నిధులు: చెరుకు విజయ్ అమర్ రెడ్డి హర్షం
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని 14 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి రూ.1.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
Thoguta: తొగుట మండలానికి రూ.1.40 కోట్ల నిధులు: చెరుకు విజయ్ అమర్ రెడ్డి హర్షం
దుబ్బాక/తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని 14 గ్రామాలకు రూ.1.40 కోట్ల వ్యయంతో మహిళా సమాఖ్య భవనాలు మంజూరు కావడం ఎంతో సంతోషకరమైన విషయమని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చెరుకు విజయ్ అమర్ రెడ్డి అన్నారు.
మహిళా సమాఖ్య భవనాల మంజూరుకు రాష్ట్ర ఇన్‌చార్జి మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన ప్రత్యేక కృషి, నిరంతర చొరవ ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు.మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు అందుబాటులోకి రావడం ద్వారా సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. గ్రామీణ మహిళల సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణాభివృద్ధికి ఈ భవనాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.




