కేంద్ర నిధులతోనే మహిళా సాధికారత.. క్రెడిట్ కొట్టేయాలని చూస్తే కుదరదు: శ్రీకాంత్ యాదవ్

మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై తొగుట మండలం చందాపూర్ ఉప సర్పంచ్ ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 29 Jun 2026 7:56 AM IST
కేంద్ర నిధులతోనే మహిళా సాధికారత.. క్రెడిట్ కొట్టేయాలని చూస్తే కుదరదు: శ్రీకాంత్ యాదవ్
X

తొగుట/సిద్దిపేట: మహిళా స్వయం సహాయక సంఘాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం నిధుల మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం అని సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామ ఉప సర్పంచ్ ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా ఈ నిధులు అందుబాటులోకి రావడం అభినందనీయం.

మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు నిరంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలను నియోజకవర్గానికి తీసుకురావడంలో చేస్తున్న కృషి ప్రశంసనీయం. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇతర పార్టీలు తమ ఘనతగా చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే.మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిరంతరం కృషి చేస్తున్నారు.సబ్కా సాథ్ - సబ్కా వికాస్ - సబ్కా విశ్వాస్" అనే సంకల్పంతో దేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story