Thoguta: తొగుట మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు పూర్తి!
Thoguta: మార్కెట్ యార్డులో ధాన్యం, మక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి
Thoguta: తొగుట మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు పూర్తి!
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని విక్రయించేలా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని అభినందించారు.
తొగుట మండల వ్యాప్తంగా ఐకేపీ ద్వారా వడ్లు 2829 మంది రైతుల ద్వారా 116537.60 క్వింటాళ్ల ధాన్యం,PACS కాన్గల్ ద్వారా 1279 రైతుల నుండి 55149.60 క్వింటాళ్ల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు.
అదే విధంగా PACS కాన్గల్ ద్వారా 746 రైతుల నుండి 9521.50 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు,730 మంది రైతుల ద్వారా 29686 క్వింటాళ్ల మక్కజొన్న పంటను సేకరించడం జరిగిందన్నారు.




