Thoguta: తోగుట పీఏసీఎస్ ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు!
Thoguta: సిద్దిపేట జిల్లా తోగుట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో 'సొసైటీ వీక్' (సహకార వారోత్సవాలు) ఘనంగా ప్రారంభమయ్యాయి.
Thoguta: తోగుట పీఏసీఎస్ ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు!
Thoguta: సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని సొసైటీ కార్యాలయం ఎదుట సొసైటీ వీక్ సందర్భంగా సొసైటీ జెండాను చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సంఘాల ఎదుగుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.
సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి రైతులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 70 శాతం మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. సహకార సంఘాలలో రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి రుణాలను పొంది సహకార బలోపేతానికి సహకరించాలన్నారు.
సహకార సంఘాలలో రైతులు డిపాజిట్లు చేసినట్లయితే సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయి అన్నారు.అనంతరం సొసైటీ బలోపేత ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, సీఈఓ గంగారెడ్డి, సిబ్బంది చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




