Dubbak: రాజ్యాంగాన్ని చదివిన వారే రాజ్యాన్ని పరిపాలిస్తారు: వనం రమేష్!
Dubbak: రాజ్యాంగాన్ని చదివిన వారే రాజ్యాన్ని పరిపాలించే హక్కు పొందుతారని ఐకాస ట్రైబల్స్ రాష్ట్ర అధ్యక్షుడు, దుబ్బాక కౌన్సిలర్ వనం రమేష్ గురువారం అన్నారు.
Dubbak: రాజ్యాంగాన్ని చదివిన వారే రాజ్యాన్ని పరిపాలిస్తారు: వనం రమేష్!
Dubbak: అన్ని ప్రజాసంఘాల ఐకాస ట్రైబల్స్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ మాట్లాడుతూ... భారత రాజ్యాంగం CONSTITUTION OF INDIA ఈ బుక్కును ఎక్కువ చదివినది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర సామాజిక వర్గాలలో చాలా తక్కువ మంది ఉన్నారు. రాజ్యాంగం బుక్కు ను చదివినోళ్లు రాజ్యాన్ని పరిపాలించే హక్కును పొందుతారు.
భారత రాజ్యాంగం బుక్కు సుమారు 600 పేజీల పైన ఉంటుంది. కొంతమందికి భారత రాజ్యాంగం బుక్ కోసం కూడా తెలియదు అని అప్పుడప్పుడు సమావేశాల్లో చెపుతుంటారు. భారతదేశంలో అమలైన ప్రతి సామాజిక వర్గం రిజర్వేషన్ సంబంధించి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వివరాలను క్లుప్తంగా సేకరించి ప్రభుత్వాలు రిజర్వేషన్లను అమలు చేసినయి చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడదలచుకోలేదు ఈ క్రింది విధంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను.
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) జరుపుకుంటారు. ఇది పూర్తిస్థాయిలో 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది.




