Siddipet: అంగన్‌వాడీలలో బాలమేళా.. చిన్నారుల ప్రతిభా ప్రదర్శనలు
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుటలో నాలుగు అంగన్‌వాడీ సెంటర్ల ఆధ్వర్యంలో 'బాలమేళా' నిర్వహించారు.
Siddipet: అంగన్‌వాడీలలో బాలమేళా.. చిన్నారుల ప్రతిభా ప్రదర్శనలు
సిద్దిపేట జిల్లా: తొగుటలో నాలుగు అంగన్వాడి సెంటర్ కలిపి బాలమేళా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శోభ కొండల్ రెడ్డి, బ్లాక్ కో -ఆర్డినేటర్ భాస్కర్, సూపర్ వైజర్ శ్రీలేఖ, లో పిల్లలు ఆటలు, పాటలు, కథలు, పూర్వ గణిత భావనలు ప్రదర్శించారు తల్లుల తో ఆటలు ఆడిపించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్లాక్ కో ఆర్డినేటర్ భాస్కర్ మాట్లాడుతూ పిల్లలు ఈ వయసులో ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా ఆటలు పాటలతో చదువు నేర్పించాలి, అందుగురించి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ లో ప్లే బేస్డ్ లెర్నింగ్ ద్వారా నేర్పిస్తున్నారు కానీ ఈ విషయాలు అర్ధం కాక నేటి తల్లి తండ్రులు అక్షరాలు ముఖ్యమని ప్రైవేట్ పంపిస్తున్నారు అక్కడ బట్టి విధానం అలవాటు చేస్తున్నారు ఇది పిల్లల ఎదుగుదల కి మంచిది కాదు ఈ విషయాలు అర్ధం కావాలనే ఈ బాలమేళా కార్యక్రమం చేస్తున్నాం, కాబట్టి 3 సంవత్సరాలనుండి అందరిని అంగన్వాడీ కి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు అనిత,విజయ,మాధవి,వసంత వార్డు మెంబర్లు బలవ్వ, కానీ, వివో లీడర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




