Thukkapur: అధికారుల నిర్లక్ష్యం: రాత్రికి రాత్రి వైకుంఠధామం కూల్చివేత!

Thukkapur: సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల రూ. 10 లక్షల ఉపాధి హామీ నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.

Chindam Karunakar, Dubbak
Published on: 27 Jun 2026 7:37 AM IST
Thukkapur
X

 Thukkapur: అధికారుల నిర్లక్ష్యం: రాత్రికి రాత్రి వైకుంఠధామం కూల్చివేత!

తొగుట (సిద్దిపేట జిల్లా): మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మౌలిక వసతుల కల్పనకోసం ప్రభుత్వం విరివిగా నిధులు మంజూరు చేస్తున్నప్ప టికీ అధికారుల అనాలోచిత నిర్ణయాల మూలంగా ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో 1380 జనాభా ఉండగా 420 గృహాలు ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం నిధుల కింద 10 లక్షల రూపాయలతో గ్రామ సమీ పంలో 2022లో డంపు యార్డు,వైకుంఠధామాన్ని నిర్మించారు.

నిర్మాణం చేప ట్టిన ఏడాదిన్నర గడవక ముందే మల్లన్నసాగర్ అదనపు టీఎంసీ ఓపెన్ కెనాల్ విద్యు త్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం అంటూ మెగా కన్స్ట్రక్ష న్ కంపెనీ కాంట్రాక్టర్ 2023 జూలై 5న రాత్రికి రాత్రి వైకుంఠధామం, డంపు యార్డులను కూల్చివేశారు. దాంతో అప్పట్లో గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం 1300 ఎకరాల భూమిని, అదనపు టీఎంసీ ఓపెన్ కెనాలు కాలువ నిర్మాణం కోసం మరోమారు 52 ఎకరాల భూమిని త్యాగం చేసారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story