Bhumpally: సిద్దిపేట వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు గల్లంతు!

Bhumpally: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం రుద్రారం పెద్ద చెరువులో వినాయక నిమజ్జనంలో విషాదం. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు.

KARUNAKAR,	DUBBAK
Published on: 27 Sept 2026 12:00 PM IST
Bhumpally
X

Bhumpally: సిద్దిపేట వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు గల్లంతు!

Bhumpally: సిద్దిపేట జిల్లాలో వినాయక నిమజ్జనం విషాదంగా మారింది. అక్బర్ పేట-భూంపల్లి మండలం రుద్రారం పెద్ద చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఇద్దరు యువకులు చెరువులో గల్లంతయ్యారు. రుద్రారం గ్రామానికి చెందిన పార రమేష్ (35), కలాల్ నవీన్ (25) అనే యువకులు శనివారం రెండు వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం చెరువు కట్టకు తీసుకెళ్లారు.

నిమజ్జనం అనంతరం చెరువులో స్నానం చేస్తుండగా ఇద్దరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారని స్నేహితులు తెలిపారు. గమనించిన తోటి స్నేహితులు వెంటనే గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. విషయం గ్రామస్తులకు తెలియడంతో చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే నిమజ్జనం కోసం చెరువు కట్టకు వచ్చే భక్తుల కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK