Dubbaka: ఇంటింటికీ చదువు ఊరంతా వెలుగు:మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీతా రవీందర్

Dubbaka: దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో 'ఉల్లాస్' అక్షరాస్యత కార్యక్రమం ప్రారంభం. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం.

KARUNAKAR,	DUBBAK
Published on: 15 May 2026 8:00 AM IST
Dubbaka
X

Dubbaka: ఇంటింటికీ చదువు ఊరంతా వెలుగు:మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీతా రవీందర్

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉల్లాస్ (సమాజంలోని అందరికీ జీవితకాల అభ్యాసంపై అవగాహన) అక్షరాభ్యసత కార్యక్రమం SLF OBS,RP లకు ఒక్కరోజు శిక్షణా తరగతులను దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీతా రవీందర్ ప్రారంభించారు.వారు మాట్లాడుతూ చదువుకునే అవకాశం లభించని 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల మహిళలందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

దుబ్బాక పట్టణంలో అన్ని మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి SLF OBS,RP లు వారికి స్వచ్ఛందంగా చదువు చెప్పుటకై ఇట్టి శిక్షణా తరగతుల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఒక్కొక్క RP,OB కూడా 10 మంది నిరక్షరాస్యులకు స్వచ్ఛందంగా చదువును బోధించాలన్నారు. అమ్మకు అక్షర మాల ద్వారా ప్రతి ఒక్క మహిళా కూడా నిరక్షరాస్యులు ఉండకుండా దేశంలో ప్రతి మహిళ అక్షరాస్యులై ఉండాలన్నారు. సమాజంలో ఉన్న మహిళలు అంతా కూడా అక్షరాస్యులైతే దేశం బాగుపడుతుందన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story