Toguta: తోగుట ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్సై నవీన్

Toguta: తోగుట ఎస్సైగా వి. నవీన్ బాధ్యతల స్వీకరణ. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా ఉంటామని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కొత్త ఎస్సై విజ్ఞప్తి.

Chindam Karunakar, Dubbak
Published on: 23 Jun 2026 9:01 AM IST
Toguta
X

Toguta: తోగుట ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్సై నవీన్

సిద్దిపేట జిల్లా: తోగుట పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా వి నవీన్ పదవీ బాధ్యతలను చేపట్టారు. తొగుట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవి కాంత్ రావు ఇటీవల బదిలీపై సిసిఆర్బి కి వెళ్లారు.

ఈ సందర్భంగా నూతన ఎస్సై నవీన్ మాట్లాడుతూ గతంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేయడం జరిగిందన్నారు. మండలంలోని ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని మండల ప్రజలకు సూచించారు.

మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన వెంటనే 100 నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలను నడిపి, రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ఓయ్ ధరించి వాహనాలను నడపాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ విలువైన జీవితాలను కోల్పోవద్దని అన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story