Siddipet: రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు.. వనం రమేష్ వ్యాఖ్యలు
Siddipet: ఐకేపీ ధాన్యం దిగుమతిపై రైస్ మిల్లుల వద్ద ఉద్రిక్తత నెలకొనగా రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని కౌన్సిలర్ వనం రమేష్ అన్నారు.
Siddipet
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేట IKP ద్వారా వ్యవసాయ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి పరిధిలోని రైస్ మిల్లర్లు భారతీ రైస్ మిల్ మరియు మంజునాథ రైస్ మిల్ లలో లారీలలో నుండి వరి ధాన్యాన్ని దిగుమతి చేయకుండా ఆ ఏరియా నాయకులు ఆపడం జరిగింది.
*వెంటనే దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ అక్బర్ పేట మండలంలోని భారతి రైస్ మిల్ మరియు మంజునాథ రైస్ మిల్లర్లతో మరియు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి రైతుల నుంచి ఐకెపి ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా రైస్ మిల్లర్లు దిగుమతి చేసుకోవాలని మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో 7 వ వార్డు కౌన్సిలర్ గోవింద్ గారి శోభ రాణి విష్ణువర్ధన్ రెడ్డి, మాజి కౌన్సిలర్ బత్తుల స్వామి, ఐరేని శివరాజం, వనం అశోక్, RPలు, రైతులు ఉన్నారు.




