Siddipet: భక్తిశ్రద్ధల నడుమ చౌడాలమ్మ తల్లి వార్షిక వేడుకలు!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో ఘనంగా శ్రీ చౌడాలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవం.

Chindam Karunakar, Dubbak
Published on: 26 April 2026 10:28 AM IST
Siddipet
X

Siddipet: భక్తిశ్రద్ధల నడుమ చౌడాలమ్మ తల్లి వార్షిక వేడుకలు!

సిద్దిపేట జిల్లా: తొగుట మండలం వెంకట్రావుపేటలో వెలసిన శ్రీ చౌడాలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవం భక్తి, శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర వేడుకల్లో దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

చౌడాలమ్మ తల్లి కటాక్షంతో ప్రజలందరూ ధాన్య సంపదతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.అమ్మవారి అనుగ్రహమే గ్రామాభివృద్ధికి మూలం” అని పేర్కొన్నారు.దేవీ దయ ఉంటే దరిద్రం దూరమై, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి” అని విశ్వాసం వ్యక్తం చేశారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికి, ఘనంగా సన్మానించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story