Siddipet: కాలినడకన తిరుమల కొండెక్కిన వెంకట్రావుపేట సర్పంచ్!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్‌ బండారు కవిత స్వామి గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి మొక్కును తీర్చుకున్నారు.

Chindam Karunakar, Dubbak
Published on: 16 May 2026 11:14 AM IST
Siddipet
X

Siddipet: కాలినడకన తిరుమల కొండెక్కిన వెంకట్రావుపేట సర్పంచ్!

సిద్దిపేట జిల్లా: తొగుట వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన సందర్భంగా చేసిన మొక్కును తీర్చుకుంటూ మండలంలోని వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత భర్త స్వామి గౌడ్ తో పాటు కుమార్తెలు జ్యోష్ణ , స్నేహలతో కలిసి తిరుమల శ్రీవారిని కాలి నడక దర్శించుకున్నారు.ఒక్కో మెట్టుకు భక్తి బొట్టు పెట్టుకుంటూ, భగవంతుని నామస్మరణతో మొత్తం 3550 మెట్లు ఎక్కి ఏడుకొండల వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ మొక్కును భక్తిశ్రద్ధలతో తీర్చుకున్నారు.

“సర్పంచ్‌గా గెలిస్తే తిరుమల కొండను మెట్ల మార్గంలో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటాను” అని గతంలో చేసిన సంకల్పాన్ని నెరవేర్చుకున్న కవితమ్మ… స్వామివారి ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు సాగాలని, వెంకట్రావుపేట గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో చల్లగా చూడాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించారు.భక్తి… నమ్మకం… సంకల్పం కలిస్తే దేవుని కృప తప్పక లభిస్తుంది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story