Toguta: తొగుటలో నీటి కష్టాలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన గ్రామస్తులు!
Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం సయ్యద్ నగర్ కాలనీలో తాగునీటి కోసం ప్రజల ఆందోళన.
Toguta: తొగుటలో నీటి కష్టాలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన గ్రామస్తులు!
Toguta: గత వారం రోజులుగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డి పేట మధిర సయ్యద్ నగర్ కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో ఈరోజు కాలనీవాసులు బిందెలు పట్టుకుని పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మిషన్ భగీరథ నీటి సరఫరాను గతంలో మాదిరిగానే యథావిధిగా పునరుద్ధరించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సయ్యద్ నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




