Dubbaka: రాజక్కపేటలో భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ జయంతి వేడుకలు!
Dubbaka: దుబ్బాక మండలం రాజక్కపేటలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూజల్లో పాల్గొన్న సర్పంచ్ పాతకోటి పద్మ వెంకటేష్, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు.
Dubbaka: రాజక్కపేటలో భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ జయంతి వేడుకలు!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండా ఎగిరి వేసి పూలమాలలు వేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సంఘం సభ్యులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని విశ్వకర్మ భగవానుడిని భక్తిశ్రద్ధలతో పూజించారు.
ఈ కార్యక్రమానికి రాజక్కపేట సర్పంచ్ పాతకోటి పద్మ వెంకటేష్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పిన్నోజీ ప్రభాకర్, సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.విశ్వకర్మ భగవానుడు సృష్టి, నిర్మాణం, శిల్పకళకు ప్రతీకగా భావిస్తారని, సమాజ నిర్మాణంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
తమ వృత్తి నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ, సమాజ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాలని, సంఘం అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.




