Siddipet: గజ్వేల్‌లో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం.. హాజరైన ఎంపీ రఘునందన్ రావు!
Siddipet: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
Siddipet: గజ్వేల్‌లో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం.. హాజరైన ఎంపీ రఘునందన్ రావు!
సిద్దిపేట జిల్లా, గజ్వేల్: గజ్వేల్ పట్టణంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను అభినందించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. “గతాన్ని, మధుర క్షణాలను తిరిగి కళ్లముందు ఆవిష్కరించడమే ఫోటోగ్రఫీ నైపుణ్యం” అని కొనియాడారు. ఫోటోగ్రఫీ అంటే కేవలం ఒక దృశ్యాన్ని చిత్రీకరించడం కాదని, మనిషిని, మనసును కదిలించే శక్తి అని అన్నారు.
ఒక వ్యక్తి గంటసేపు ఉపన్యాసం ఇచ్చినా ఆ మాటలు కొంతకాలానికి మదిలో నుంచి చెరిగిపోవచ్చని, కానీ ఒక ఫోటోగ్రాఫర్ తీసిన అద్భుతమైన ఫోటో మాత్రం జీవితాంతం మనసులో నిలిచిపోతుందని రఘునందన్ రావు అన్నారు. ప్రపంచాన్ని సైతం జాగృతం చేసే శక్తివంతమైన ఆయుధం ఫోటోగ్రఫీ అని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న హృదయవిదారక సన్నివేశాలు, బాధాకర ఘటనలు, చారిత్రక ఘట్టాలు ఎన్నో ఫోటోల రూపంలో శాశ్వతంగా భద్రపడి ఉన్నాయని తెలిపారు. ఒక మంచి ఫోటో సమాజాన్ని ఆలోచింపజేయడంతో పాటు మార్పుకు దారితీసే శక్తిని కలిగి ఉంటుందని అన్నారు.




