Dubbaka: రఘునందన్ రావు పట్టుదల ఫలించింది.. దుబ్బాకకు విద్యా మహర్దశ

Dubbaka: ఎంపీ రఘునందన్ రావు నిరంతర కృషితో దుబ్బాక నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది.

KARUNAKAR,	DUBBAK
Published on: 11 July 2026 9:29 AM IST
Dubbaka
X

Dubbaka: రఘునందన్ రావు పట్టుదల ఫలించింది.. దుబ్బాకకు విద్యా మహర్దశ

Dubbaka: నర్మెట్ట లో సభ లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుబ్బాక నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయాలని మెదక్ ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ, "ఇవి మాత్రమే కాదు... దుబ్బాకకు ఇంకా మరెన్నో ఇస్తాం" అని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత కూడా పలుమార్లు వివిధ అధికారిక వేదికలపై, సమావేశాల్లో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, యంగ్ ఇండియా స్కూల్‌ను దుబ్బాకకు మంజూరు చేయాలని మెదక్ ఎంపీ గారు నిరంతరం విజ్ఞప్తి చేశారు.

ఎంపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దుబ్బాకకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను మంజూరు చేయడంతో పాటు, దాని ఏర్పాటుకు రూ.200 కోట్ల నిధులను విడుదల చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే మెదక్ ఎంపీ రఘునందన్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story