Viral : పదునైన చెవిపోగు మింగిన చిన్నారి.. సర్జరీ లేకుండా డాక్టర్లు చేసిన మ్యాజిక్.!
Viral : సూరత్‌లో ఓ పసికందు విషయంలో ఊహించని షాకింగ్ ఘటన జరిగింది. ఆడుకుంటూ ఆడుకుంటూ 11 నెలల పాప అనుకోకుండా ఒక పదునైన లోహపు చెవిపోగును
Viral
Viral : సూరత్‌లో ఓ పసికందు విషయంలో ఊహించని షాకింగ్ ఘటన జరిగింది. ఆడుకుంటూ ఆడుకుంటూ 11 నెలల పాప అనుకోకుండా ఒక పదునైన లోహపు చెవిపోగును నోట్లో వేసుకుని మింగేసింది. అది వెళ్లి నేరుగా పాప ఆహార నాళంలో (అన్నవాహిక) అడ్డంగా చిక్కుకోవడంతో తీవ్ర ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. అయితే, డాక్టర్లు చూపించిన అద్భుతమైన సమయస్ఫూర్తి వల్ల చిన్నారికి ఎలాంటి సర్జరీ లేకుండానే ఆ చెవిపోగును బయటకు తీసి పాప ప్రాణాలను కాపాడారు.
క్షణాల్లో మారిన సీన్.. భయంతో వణికిపోయిన పేరెంట్స్
జూలై 16న సూరత్‌లో ఉండే ఒక పారిశుధ్య కార్మికుడు లికేష్ బోకే ఇంట్లో ఈ ఊహించని సంఘటన జరిగింది. ఆయన 11 నెలల కూతురు ఇంట్లో నేలపై ఆడుకుంటూ, అక్కడ పడి ఉన్న పదునైన చెవిపోగును తీసి నోట్లో వేసుకుంది. మరుక్షణమే ఆ పాప గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పాటు ఉమ్ము కూడా మింగలేక తీవ్రంగా విలవిలలాడింది. పాప పరిస్థితి చూసి హడలిపోయిన తల్లిదండ్రులు వెంటనే సూరత్ న్యూ సివిల్ హాస్పిటల్ లోని ఈఎన్టీ (ENT) విభాగానికి పరుగెత్తారు.
అన్నవాహికలో పదునైన పోగు.. డాక్టర్లకు మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్
పాపను చూడగానే డాక్టర్లు లేట్ చేయకుండా వెంటనే ఎక్స్-రే తీశారు. అందులో పదునైన చెవిపోగు పాప అన్నవాహికలో గట్టిగా చిక్కుకుని కనిపించింది. 11 నెలల పసిపాప కాబట్టి లోపలి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ చెవిపోగుకు ఉన్న పదునైన అంచులు అన్నవాహికను గుచ్చుకుంటే లోపల పెద్ద గాయమై పాప ప్రాణాలకే ముప్పు వస్తుందని గ్రహించిన డాక్టర్ జైమిన్ కాంట్రాక్టర్ బృందం తక్షణమే రంగంలోకి దిగింది.
కోత లేకుండానే ఎండోస్కోపీ మ్యాజిక్
పాపను వెంటనే ఆపరేషన్ థియేటర్‌కు తరలించి, ప్రత్యేక ఈఎన్టీ నిపుణుడు డాక్టర్ నవనీత్ మక్వానా ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఎసోఫాగోస్కోప్, ప్రత్యేకమైన ఫోర్సెప్స్ సాయంతో ఎండోస్కోపీ ద్వారా ఎలాంటి గాయం లేదా కోత పెట్టకుండానే దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు కష్టపడి ఆ చెవిపోగును సేఫ్‌గా బయటకు తీశారు. "పసిపాప గుండె, ఆహార నాళం భాగాలు చాలా డెలికేట్‌గా ఉంటాయి. కొద్దిగా పొరపాటు జరిగినా లోపల రంధ్రం పడే ప్రమాదం ఉంది. అందుకే చాలా కేర్ తీసుకుని దాన్ని బయటకు తీశాం" అని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం పాప హ్యాపీగా, హెల్దీగా ఉంది.
రూ. 60 వేల వైద్యం ఫ్రీగా.. తల్లిదండ్రులకు కొండంత హ్యాపీనెస్
ఇలాంటి కాంప్లికేటెడ్ ఎండోస్కోపీకి బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే దాదాపు రూ. 50,000 నుంచి రూ. 60,000 వరకు చార్జ్ చేస్తారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా సూరత్ సివిల్ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా ఈ ప్రొసీజర్ చేసి పాపను కాపాడటంతో ఆ పేద కుటుంబం డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుతోంది.
ఈ సందర్భంగా చిన్నపిల్లల పేరెంట్స్‌కు డాక్టర్లు ఒక ముఖ్యాతి ముఖ్యమైన వార్నింగ్ ఇచ్చారు. చిన్నపిల్లల చేతికి నాణేలు, చెవిపోగులు, చిన్న చిన్న రబ్బరు ముక్కలు, పదునైన వస్తువులు దొరక్కుండా దూరంగా ఉంచాలని, ఒకవేళ పొరపాటున పిల్లలు ఏదైనా మింగితే అస్సలు లేట్ చేయకుండా వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.




