Math Puzzle: 15 సెకన్లలో సమాధానం చెప్పగలరా?.. ఈ చిన్న లాజిక్ కనిపెడితే మీరే జీనియస్!

Can you solve this viral math puzzle in just 15 seconds. నెటిజన్లను బాగా ఆలోచింపజేస్తున్న ఓ ఆసక్తికరమైన నంబర్ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rishvik
Published on: 6 Aug 2026 8:15 PM IST
Math Puzzle
X

Math Puzzle: 15 సెకన్లలో సమాధానం చెప్పగలరా?.. ఈ చిన్న లాజిక్ కనిపెడితే మీరే జీనియస్!

Math Puzzle: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో మ్యాథ్స్ పజిల్స్, ఐక్యూ ఛాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. మొదటి చూపులో ఇవి సాధారణ గణిత పజిల్స్ మాదిరిగా కనిపించినా.. వాటి వెనుక దాగి ఉన్న లాజిక్‌ను గుర్తించిన వారే సరైన సమాధానం చెప్పగలుగుతారు. అందులో కొన్ని చాలా ఈజీగా ఉంటే.. మరికొన్ని మాత్రం మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది. తాజాగా నెటిజన్లను బాగా ఆలోచింపజేస్తున్న ఓ ఆసక్తికరమైన నంబర్ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చింతించాల్సిన అవసరం లేదు:

ఈ పజిల్‌లో వరుసగా 2 × 2 = 6, 4 × 4 = 20, 6 × 6 = 42 అని ఇచ్చి.. చివరగా 8 × 8 = ? అని ప్రశ్నించారు. చాలామంది 64 అని సమాధానం చెబుతున్నారు. అయితే ఈ పజిల్‌కు సరైన సమాధానం అది కాదు. ఈ పజిల్‌లో ప్యాటర్న్‌ను అనుసరించారు. పజిల్‌లో సాధారణ గుణకారం సహా ఓ ప్రత్యేకమైన ప్యాటర్న్‌ను ఉపయోగించారు. ఆ ఈ చిన్న లాజిక్ కనిపెడితే ఆన్సర్ చాలా సింపుల్. 15 సెకన్లలో సమాధానం చెపితే మీరే జీనియస్. ఓసారి ట్రై చేసి చూడండి. ఆన్సర్ రాకున్నా ఏం చింతించాల్సిన అవసరం లేదు. అసలు లాజిక్ ఏంటో కింద వివరంగా ఉంది.

లాజిక్ ఏంటంటే?:

ఈ పజిల్‌లో ప్రతి సంఖ్యను ముందుగా సాధారణంగా గుణించి.. వచ్చిన ఫలితానికి అదే సంఖ్యను అదనంగా కలపాలి. 2 × 2 = 4 ఎలా వచ్చిందో చూద్దాం. 2 × 2 = 4 అవుతుంది. 4కు 2ను యాడ్ చేస్తే 6 వస్తుంది. 4 × 4 = 16 కాగా.. 16 +4 = 20 అవుతుంది. 6 × 6 = 36 కాగా.. 36 + 6 = 42 అవుతుంది. అదే నియమాన్ని చివరి వరుసకు వర్తింపజేస్తే.. 8 × 8 = 64.. 64 + 8 = 72 అవుతుంది.

2 × 2 = 4, +2 = 6

4 × 4 = 16, +4 = 20

6 × 6 = 36, +6 = 42

8 × 8 = 64, +6 = 72

ఈ పజిల్‌కు సరైన సమాధానం 72.

చాలామంది ఎందుకు తప్పు చెబుతున్నారు?:

ఈ తరహా పజిల్స్‌లో ఎక్కువ మంది కేవలం గుణకారంపైనే దృష్టి పెడతారు. కానీ ప్రతి వరుసలో ఒకే విధమైన అదనపు ప్యాటర్న్‌ ఉంటుందనే విషయాన్ని గమనించరు. ఆ ప్యాటర్న్‌ను గుర్తించిన వారే సరైన సమాధానాన్ని చెప్పగలుగుతారు.

మెదడుకు మంచి వ్యాయామం:

ఇలాంటి మ్యాథ్స్, ఐక్యూ పజిల్స్ కేవలం వినోదానికే కాదు. పరిశీలనా శక్తిని, ఆలోచనను, ప్యాటర్న్‌లను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి. అందుకే ఇలాంటి పజిల్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంటాయి. మీరు కూడా ఈ పజిల్‌ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుని.. వారు ఎంత త్వరగా 72 అనే సరైన సమాధానాన్ని గుర్తిస్తారో ఒకసారి పరీక్షించండి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story