Viral: 5-4-3-2-1 టెక్నిక్.! ఆందోళన, ఒత్తిడిని ఇట్టే తగ్గించే ఈ టెక్నిక్ ఎప్పుడైనా విన్నారా.?

ఆఫీస్ టెన్షన్లు, కుటుంబ బాధ్యతలు లేదా ఇతర కారణాల వల్ల కలిగే ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నిపుణులు సూచిస్తున్న '5-4-3-2-1 టెక్నిక్' గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Ravi
By Ravi
Published on: 21 July 2026 8:43 PM IST
Viral
X

Viral: 5-4-3-2-1 టెక్నిక్.! ఆందోళన, ఒత్తిడిని ఇట్టే తగ్గించే ఈ టెక్నిక్ ఎప్పుడైనా విన్నారా.?

Viral: ప్రస్తుత ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆఫీస్ పనులు, కుటుంబ బాధ్యతలు లేదా ఇతర టెన్షన్ల కారణంగా కొందరి మనసు స్థిమితంగా ఉండదు. దీనివల్ల దీర్ఘాలోచనలు చేయడం, చేతులు వణకడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి శారీరక సమస్యలు కూడా వేధిస్తుంటాయి. ఇటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి మానసిక నిపుణులు '5-4-3-2-1 టెక్నిక్' బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఈ టెక్నిక్ అనేది మన ఇంద్రియాలను ఉపయోగించి మనస్సును వర్తమానంలోకి తీసుకువచ్చే ఒక ప్రభావవంతమైన పద్ధతి. దీనిని ఆచరించడం చాలా సులభం. మీకు తీవ్రమైన ఆందోళన లేదా ఒత్తిడి అనిపించినప్పుడు, మీ చుట్టూ ఉండే ఏదైనా 5 వస్తువులను నిశితంగా చూడాలి. ఆ తర్వాత మీ దగ్గర్లో ఉన్న 4 వేర్వేరు వస్తువులను తాకడం ద్వారా వాటి స్పర్శను గమనించాలి. ఆ తరువాత మీ చుట్టూ వినిపించే 3 వేర్వేరు శబ్దాలను శ్రద్ధగా వినాలి. ఆపై ఏవైనా 2 వాసనలను పీల్చడం చేయాలి. చివరగా ఏదో ఒకటి టేస్ట్ చేయడం ద్వారా మీ రుచి మొగ్గలను ఉత్తేజితం చేయాలి.

కాగా, ఈ ఐదు దశల ప్రక్రియను పూర్తి చేసేసరికి మీ మనసు చుట్టూ ఉన్న అనవసరమైన ఆలోచనలు తొలగిపోయి, ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ పద్ధతిని పాటించవచ్చు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఆందోళనగా అనిపించిన క్షణాల్లో ఈ టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది. కాగా, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి, మనసును అదుపులో ఉంచుకోవడానికి ఇలాంటి చిన్నచిన్న టెక్నిక్‌లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story