Math Puzzle: డెడ్ ఈజీ మ్యాథ్స్ పజిల్‌.. 5 సెకన్లలో ఆన్సర్ కనిపెడితే మీరే జీనియస్!

Can you solve this easy math puzzle in just 5 seconds. పజిల్స్ మొదటి చూపులో చాలా సింపుల్‌గా కనిపించినా.. వాటిలో దాగి ఉన్న చిన్న లాజిక్‌ను గుర్తించడానికి మాత్రం కాస్త ఆలోచించాల్సి ఉంటుంది.

Rishvik
Published on: 10 Aug 2026 8:05 PM IST
Math Puzzle
X

Math Puzzle: డెడ్ ఈజీ మ్యాథ్స్ పజిల్‌.. 5 సెకన్లలో ఆన్సర్ కనిపెడితే మీరే జీనియస్!

Math Puzzle: సోషల్ మీడియాలో మ్యాథ్స్ పజిల్స్, ఐక్యూ ఛాలెంజ్‌లు ప్రతిరోజు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని చాలా సింపుల్‌గా ఉంటే.. మరికొన్ని మాత్రం కాస్త కఠినంగా ఉంటాయి. మరికొన్ని మొదటి చూపులో చాలా సింపుల్‌గా కనిపించినా.. వాటిలో దాగి ఉన్న చిన్న లాజిక్‌ను గుర్తించడానికి మాత్రం కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ ఈజీ మ్యాథ్స్ పజిల్ నెటిజన్లను తెగ ఆలోచింపజేస్తోంది. కేవలం 5 సెకన్లలో సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ పజిల్‌కు 5 సెకన్లలో ఆన్సర్ కనిపెడితే మీరే జీనియస్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

పజిల్ ఏంటంటే?:

ఈ వైరల్ పజిల్‌లో వరుసగా కొన్ని గణిత సమీకరణాలు ఇచ్చారు. మూడింటికి సమాధానాలు ఇచ్చి.. నాలుగో సమీకరణంకు ఆన్సర్ ఏంటి అని ప్రశ్నించారు.

5 + 5 = 26

6 + 6 = 38

7 + 7 = 52

9 + 9 = ??

లాజిక్ ఏంటనే ఆసక్తి:

చూడటానికి సాధారణ కూడికలాగే ఉన్నప్పటికీ.. ఇక్కడ ఓ లాజిక్ దాగుంది. సాధారణంగా 5+5 అంటే 10, 6+6 అంటే 12, 7+7 అంటే 14 అవుతాయి. కానీ ఇక్కడ ఇచ్చిన సమాధానాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దీంతో అసలు ఇందులో దాగి ఉన్న లాజిక్ ఏంటనే ఆసక్తి పెరుగుతోంది.

అసలు సమాధానం 85:

ఈ పజిల్‌కు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాధానం 85. అంటే చివరి ప్రశ్నలో 9 + 9 = 85 అని చెబుతున్నారు. ఇలాంటి పజిల్స్‌లో సాధారణ కూడికకు బదులుగా సంఖ్యలతో మరో ప్యాటర్న్‌ను అనుసరించడం సాధారణం. అందుకే కేవలం కూడిక చేయకుండా.. ముందున్న సమీకరణాల్లో ఏదైనా ప్రత్యేకమైన నమూనా (ప్యాటర్న్‌) ఉందా అని పరిశీలించాలి.

ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది:

ఈ పజిల్‌లో ఇచ్చిన మూడు సమీకరణలను పరిశీలిస్తే 5×5 + 1 = 26, 6×6 + 2 = 38, 7×7 + 3 = 52 అనే ప్యాటర్న్‌ను గమనించవచ్చు. ఈ విధానాన్ని కొనసాగిస్తే తదుపరి సంఖ్యకు అదనంగా 4 కలపాల్సి ఉంటుంది. అప్పుడు 9×9 + 4 = 85 అవుతుంది. అందువల్ల ఈ పజిల్‌కు 85 సమాధానం.

మ్యాథ్స్ పజిల్స్ ప్రత్యేకత:

ఇదే ఇలాంటి వైరల్ మ్యాథ్స్ పజిల్స్ ప్రత్యేకత. ఒకే ప్రశ్నకు వేర్వేరు లాజిక్‌లను ఊహించే అవకాశం ఉంటుంది. అందుకే నెటిజన్ల మధ్య కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. మీరు కూడా మీ కుటుంబసభ్యులు, స్నేహితులకు షేర్ చేసి.. 9 + 9 = ? కు ఏ సమాధానం చెబుతారు? ఓసారి చూడండి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story