Viral: 6 నెలల్లో 554 మంది భర్తలు మృతి.. మెజారిటీ హత్యలే! షాకింగ్ రిపోర్ట్..
దేశవ్యాప్తంగా గత ఆరు నెలల్లో 554 మంది భర్తలు మరణించారని ఒక షాకింగ్ రిపోర్ట్ బయటపడింది. గురుగ్రామ్‌కు చెందిన 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' విడుదల చేసిన ఈ నివేదిక, అందులో మెజారిటీ మరణాలు హత్యలేనని పేర్కొనడం కలకలం రేపుతోంది.
Viral: 6 నెలల్లో 554 మంది భర్తలు మృతి.. మెజారిటీ హత్యలే! షాకింగ్ రిపోర్ట్..
Viral: సమాజంలో మహిళల భద్రత గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో, భర్తల భద్రతపై గురుగ్రామ్‌కు చెందిన 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. 2026 జనవరి నుంచి జూలై 14 వరకు మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం 554 మంది భర్తలు మరణించారు. వీరిలో 322 మంది భార్యల లేదా వారి ప్రియుల చేతిలో హత్యకు గురయ్యారు. వైవాహిక వివాదాలు, గృహహింస వంటి కారణాల వల్ల 232 మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.
కాగా, వివాహ బంధంలో పెరుగుతున్న అశాంతి, హింస ఏ స్థాయికి చేరుకున్నాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు అరికట్టడానికి అవగాహన, సమగ్రమైన చట్టపరమైన పరిష్కారాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




