Viral Video: ఇలాంటి వాళ్లకు కదా మన హెల్ప్ చేయాల్సింది.. నెట్టింట వీడియో వైరల్.!
Viral Video: వృద్ధాప్యంలో ఇంటి వద్ద ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాల్సిన 82 ఏళ్ల వృద్దుడు.. ముంబై వీధుల్లో రోజూ 12 గంటల పాటు నిలబడి చిరుతిళ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.
Viral Video: ఇలాంటి వాళ్లకు కదా మన హెల్ప్ చేయాల్సింది.. నెట్టింట వీడియో వైరల్.!
Viral Video: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఎంతోమంది సామాన్య ప్రజల జీవితాలను ఊహించని విధంగా తలకిందులు చేసింది. కోవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయి, వృద్ధాప్యంలో పొట్టకూటి కోసం ఏ ఆధారం లేకపోయినా ఎంతో ఆత్మవిశ్వాసంతో పోరాడుతున్న ఒక వృద్ధుడి కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.
ముంబైకు చెందిన ఎనభై రెండు ఏళ్ల వృద్ధుడు మన్‌సుఖ్ కాకా కన్నీటి గాథ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. శరీరం సహకరించని వయసులో కూడా ఎవరి ముందూ చేయి చాచకుండా, కష్టాలను ధైర్యంగా ఎదురించి ఆత్మగౌరవంతో బతుకుతున్న ఆయన జీవితం సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో నివసిస్తున్న మన్‌సుఖ్ కాకా తన జీవితకాలంలో దశాబ్దాల పాటు ఓ ప్రముఖ చీరల దుకాణంలో సేల్స్‌మెన్‌గా ఎంతో నిజాయితీగా పనిచేశారు. అయితే, కోవిడ్-19 సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వేరే దారిలేక తాను ఎంతో కాలంగా నమ్ముకున్న ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది.
ఉద్యోగం పోయినప్పటికీ వృద్ధాప్యంలో ఎవరిపైనా భారం కాకూడదనే బలమైన సంకల్పంతో, ఆయన తన ఇంటి సమీపంలోని వీధుల్లో స్వయంగా తయారు చేసిన హోమ్‌మేడ్ స్నాక్స్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజూ ఆయన సోదరి ఇంట్లో ఎంతో శుభ్రంగా, రుచికరంగా తయారు చేసిన ఖాక్రా, చక్లీ లాంటి సాంప్రదాయ చిరుతిళ్లను పెద్ద సంచిలో వేసుకుని ముంబై బిజీ రోడ్లపై పెట్టుకుని విక్రయిస్తున్నారు.
ఈ వయసులో ప్రతిరోజూ దాదాపు పన్నెండు గంటల పాటు ఎండనక, వాననక రోడ్డుపై నిలబడి, ఎంతో ఓపికగా కస్టమర్ల కోసం ఎదురుచూస్తూ ఆయన వ్యాపారం సాగిస్తున్నారు. ఇంతలా కష్టపడుతున్నా ఆయనకు రోజువారీ లభించే నికర ఆదాయం కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే కావడం అందరినీ కలచివేస్తోంది.
ఆరాధన ఛటర్జీ అనే ముంబైకి చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ రోడ్డుపై మన్‌సుఖ్ కాకా పడుతున్న శ్రమను చూసి చలించిపోయి, నేరుగా ఆయన దగ్గరికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకుంది. ఆయన పడుతున్న కష్టాన్ని, ముఖంలో కనిపించే ఆత్మవిశ్వాసాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అది ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయన కష్టానికి, పని పట్ల ఆయనకున్న అపారమైన నిబద్ధతకు ఫిదా అయిపోయారు. ఇంత వయసులో కష్టపడుతున్న ఇలాంటి వృద్ధుడికి మనం తప్పకుండా సహాయం చేయాలంటూ, ఆయన స్టాల్ ఉన్న ఏరియా వివరాలను అడుగుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.




