Medicines: 16 రకాల మందులపై కేంద్రం బ్యాన్.! లిస్టులో ఉన్నవి ఇవే.?

Medicines: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావిస్తూ 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందుల తయారీ, అమ్మకాలపై తక్షణమే నిషేధం విధించింది.

Ravi
By Ravi
Published on: 21 Jun 2026 11:01 AM IST
Medicines
X

Medicines: 16 రకాల మందులపై కేంద్రం బ్యాన్.! లిస్టులో ఉన్నవి ఇవే.?

Medicines: కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో విరివిగా అమ్ముడవుతున్న 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందులపై తక్షణమే నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందుల తయారీతో పాటు, వీటి అమ్మకాలను కూడా ఎక్కడికక్కడ పూర్తిగా నిలిపివేయాలని ఫార్మా కంపెనీలకు, డిస్ట్రిబ్యూటర్లకు కేంద్రం స్పష్టం చేసింది. రోగుల చికిత్స నయంలో ఎలాంటి అదనపు ప్రయోజనం లేకపోగా, వీటివల్ల భవిష్యత్తులో దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ నిషేధం ప్రధానంగా సాధారణ చికిత్సల్లో వాడే యాంటీ బయాటిక్స్, కాస్మెటిక్స్, చర్మంపై రాసే టాపికల్ మందులకు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ బ్యాన్ చేసిన 16 మందుల జాబితాలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పలు మందులు ఉన్నాయి. ముఖ్యంగా Amoxicillin, Paracetamol+Lignocaine, Aloe vera+ Vitamin E+Herbal, Cefuroxime+Serratiopeptidase, Dicyclomine+ Paracetamol+ Clidinium Bromide లాంటి కాంబినేషన్ మందులు ప్రధానంగా ఉన్నాయి.

సాధారణంగా ఒకే మాత్ర లేదా సిరప్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల మందులను కలిపి తయారు చేసే వాటిని 'ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్' అంటారు. రోగులు ఒకేసారి రకరకాల మాత్రలు వేసుకునే బదులు ఇలా కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తుంటారు. అయితే ఇలా కలపడం వెనుక కచ్చితమైన శాస్త్రీయ ఆధారం, భద్రత ఉండాలి. సరైన రేషియోలో కలపని ఈ 16 రకాల కాంబినేషన్ల వల్ల రోగులకు అదనంగా ఎలాంటి ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ నిర్ధారించింది. అందుకే ఈ మందులను పౌరుల వినియోగం నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ప్రజలు ఎవరైనా ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న కాంబినేషన్ మందులను వాడుతుంటే, వెంటనే వాటిని వాడటం ఆపేసి, తమ వైద్యులను సంప్రదించి సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులను సూచించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story