Viral: ఈ టీ పౌడర్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.! కేజీ ఎంతుందంటే?

Viral: భారతదేశంలోనే తొలిసారిగా అస్సాం రాష్ట్రంలో అత్యంత ఖరీదైన 'మాచా టీ' ఉత్పత్తి ప్రారంభమైంది.

Ravi
By Ravi
Published on: 4 July 2026 9:17 AM IST
Viral
X

Viral: ఈ టీ పౌడర్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.! కేజీ ఎంతుందంటే?

Viral: మన దేశంలో టీ తాగే అలవాటు లేని వారు దాదాపుగా ఉండరు. అయితే, సాధారణంగా మనం తాగే టీతో పాటు మార్కెట్లో గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటి రకాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన, ఖరీదైన 'మాచా టీ' గురించి బహుశా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. ప్రధానంగా చైనా, జపాన్ లాంటి దేశాల్లో మాత్రమే లభించే ఈ ప్రీమియం మాచా టీ ఉత్పత్తిని ఇప్పుడు మన భారతదేశంలోనూ తొలిసారిగా ప్రారంభించారు.

అస్సాం రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ మాచా టీని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అధికారికంగా ప్రకటించారు. ఈ టీకి మార్కెట్లో ఎంతో భారీ డిమాండ్ ఉంది. ఇటీవల గువాహటిలో జరిగిన టీ వేలంలో ఈ మాచా టీ పౌడర్ కేజీ ఏకంగా రూ.3,000 పలికి రికార్డు సృష్టించింది.

ప్రకాశవంతమైన గ్రీన్ కలర్, అద్భుతమైన ఉమామి ఫ్లేవర్‌తో ఉండే ఈ ప్రీమియం టీ తయారీ కేవలం ఇండియా, జపాన్ దేశాల మధ్య ఉన్న పదేళ్ల సుదీర్ఘ సహకారం వల్లే సాధ్యమైందని సీఎం హిమంత పేర్కొన్నారు. ఈ మాచా టీ ఉత్పత్తి ద్వారా భవిష్యత్తులో అస్సాం టీ బ్రాండ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గ్లోబల్ పాపులారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ టీ పౌడర్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇకపై మన దేశంలోనే లభించనుండటం విశేషం.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story