Auto Driver: పెళ్లైనా ఓకే, లివింగ్ రిలేషన్‌షిప్‌ అయినా ఓకే.. బంపర్ ఆఫర్

Auto Driver: పెళ్లి కోసం ఓ ఆటో డ్రైవర్ చేసిన వినూత్న ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Naresh.k
Published on: 8 Jun 2026 10:33 AM IST
Auto Driver
X

Auto Driver: పెళ్లైనా ఓకే, లివింగ్ రిలేషన్‌షిప్‌ అయినా ఓకే.. బంపర్ ఆఫర్

Marriage Ad : ఈ రోజుల్లో పెళ్లి సంబంధం కుదరాలంటే మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరగాలి, మ్యాట్రిమోనీ సైట్లలో వేలకు వేలు తగలేయాలి, లేదా బంధువుల కాళ్లు పట్టుకోవాలి. కానీ, ఓ ఆటో డ్రైవర్ మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఆలోచించాడు. నా రూటే వేరు అంటూ ట్రెండ్‌కు తగ్గట్టుగా తను నడిపే ఆటోనే ఒక మ్యాట్రిమోనీ వేదికగా మార్చేశాడు. ప్రస్తుతం ఈ వినూత్న ప్రయత్నానికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా ఆటోల వెనుక ఇల్లు కాలిపోతోంది.. చల్లారకముందే చుట్ట కాల్చుకో, డబ్బుంటేనే లోకం లాంటి కొటేషన్లు చూసుంటారు. కానీ ఈ డ్రైవర్ ఏకంగా తన జీవిత భాగస్వామి కోసం ఒక ప్రకటననే రాసేశాడు.ఆ ఆటో వెనుక ఉన్న బోర్డుపై ఏముందంటే.. నాకు భార్య లేదు. భర్త లేని నిస్సహాయులు ఎవరైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. లేదా లివింగ్ రిలేషన్‌లో ఉండాలని అనుకున్నా నన్ను సంప్రదించండి. కిందనే తన మొబైల్ నంబర్‌ను కూడా స్పష్టంగా తెలియజేశాడు.

ఈ బోర్డును వెనుక నుంచి చూసిన ఎవరో వాహనదారుడు దీన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ చూడలేదు అంటూ కొందరు తలలు పట్టుకుంటున్నారు.

మరికొందరేమో.. ఈ డ్రైవర్ మామూలోడు కాదు బాబోయ్.. మోడ్రన్ ఆలోచనలు బాగానే అబ్బాయి. మొహమాటం లేకుండా పెళ్లి లేదా లివింగ్ రిలేషన్ అని ఆప్షన్లు కూడా ఇచ్చేశాడు అంటూ కితాబిస్తున్నారు. వ్యాపారాలు పెంచుకోవడానికి ఆటోలపై యాడ్స్ వేయడం చూశాం కానీ, ఇలా సంసారాన్ని లైన్లో పెట్టడానికి యాడ్ వేయడం నిజంగా గ్రేట్ అని ఇంకొందరు నవ్వుకుంటున్నారు.

బహుశా ఆటో ఎక్కే ప్యాసింజర్లలో ఎవరికైనా ఈ ప్రకటన నచ్చి సంబంధం కుదురుస్తుందనో, లేదా ఒంటరిగా ఉన్నవారెవరైనా నేరుగా తననే సంప్రదిస్తారనో ఆ డ్రైవర్ ఆశపడి ఉండవచ్చు. ఏదేమైనా, మ్యాట్రిమోనీ యాప్‌ల జమానాలో ఈ ఆటో డ్రైవర్ చేసిన ఆఫ్‌లైన్ వినూత్న ప్రయత్నం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఈ ఆటో మ్యాట్రిమోనీ ద్వారా మనోడికి పెళ్లి కుదురుతుందో లేదో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story