Viral Video: ఇంట్లో ఒంటరిగా యువతి.. చార్జింగ్ పెట్టుకుంటానని లోపలికి వచ్చిన డెలివరీ బాయ్.. కట్ చేస్తే!
Viral Video: యువతులు ఒంటరిగా ఉన్నంట్లోకి డెలివరీ బాయ్స్ చొరబడేందుకు యత్నించిన ఘటనలు అధికమవుతున్నాయి.
Viral Video: ఇంట్లో ఒంటరిగా యువతి.. చార్జింగ్ పెట్టుకుంటానని లోపలికి వచ్చిన డెలివరీ బాయ్.. కట్ చేస్తే!
Viral Video: పెద్దపెద్ద నగరాల్లో ఒంటరిగా నివసించే యువతులు, మహిళల భద్రతకు సంబంధించి తరచూ ఆందోళనకరమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ సేవలు, పార్శిల్ డెలివరీల కోసం ఇంటికి వచ్చే వ్యక్తుల ప్రవర్తన కారణంగా కొందరు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఒక యువతికి ఎదురైన భయానక అనుభవం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో డెలివరీ పేరుతో వచ్చిన ఒక వ్యక్తి తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, తన స్నేహితుడు వదిలివెళ్లిన జాకెట్‌ను తిరిగి పంపడం కోసం ఆమె ఒక పార్శిల్ సర్వీస్‌ను బుక్ చేసుకుంది. ఆ డెలివరీ కోసం వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఫోన్‌లో మాట్లాడినప్పటి నుంచి కాస్త అతిగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. పార్శిల్ తీసుకున్న తర్వాత బ్యాగ్ కావాలని అడగడంతో ఆమె అందించింది. ఆ తర్వాత తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని, తాను పొగ తాగేందుకు బాల్కనీలోకి రావచ్చా అని ఆ వ్యక్తి అడిగాడని ఆమె వెల్లడించింది. ఆమె వెంటనే అప్రమత్తమై ఇంట్లో వేరే వారు ఉన్నారంటూ అడ్డుచెప్పినప్పటికీ, ఆ వ్యక్తి పదే పదే లోపలికి రావడానికి ప్రయత్నించడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది.
ఆ సమయంలో ఆ వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని, అతడి నుంచి ఆల్కహాల్ వాసన కూడా వచ్చిందని బాధితురాలు ఆరోపించింది. ఒకవేళ తాను కనుక అతనికి లోపలికి ప్రవేశం ఇచ్చి ఉంటే ఎలాంటి అనర్థం జరిగేదోనని తలచుకుంటేనే భయమేస్తోందని ఆమె పేర్కొంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్‌ను అప్రమత్తం చేశానని ఆమె తెలిపారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి దాడులు, వేధింపుల ఘటనలపై నగరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. మహిళల భద్రత విషయంలో డెలివరీ కంపెనీలు మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని, సిబ్బంది నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రజలు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.




