నవంబర్‌లో ట్రిప్‌కు రెడీనా? ఈ 5 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..

మీరు వర్క్ ఒత్తిడికి కాస్త గ్యాప్ ఇచ్చి, కొత్త ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్ చేయాలని అనుకుంటున్నారా? నవంబర్ నెల మీ ట్రావెల్ ప్లాన్స్‌కు ఒక పర్ఫెక్ట్ టైమ్..!,,

G Krishna
Published on: 1 Nov 2026 2:20 PM IST
నవంబర్‌లో ట్రిప్‌కు రెడీనా? ఈ 5 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
X

మీరు వర్క్ ఒత్తిడికి కాస్త గ్యాప్ ఇచ్చి, కొత్త ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్ చేయాలని అనుకుంటున్నారా? నవంబర్ నెల మీ ట్రావెల్ ప్లాన్స్‌కు ఒక పర్ఫెక్ట్ టైమ్..! వర్షాకాలం ముగిసి, చలికాలం కమ్మగా ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో ప్రయాణించడం నిజంగా ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. మరీ విపరీతమైన ఎండలు ఉండవు, అలా అని గడ్డకట్టే చలి కూడా ఉండదు. మరి ఈ రోడ్ ట్రిప్‌లు, ఫ్యామిలీ వెకేషన్స్ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడానికి ఎలాంటి ప్రదేశాలు ఎంచుకుంటే బెస్ట్‌గా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

రాజస్థాన్: ఎడారి అందాలు, రంగుల ఉత్సవాలు

నవంబర్‌లో రాయల్ రాజస్థాన్ రాయల్ లుక్‌లోకి మారిపోతుంది. వేసవిలో తీవ్రంగా ఉండే ఎండలు తగ్గడంతో థార్ ఎడారి అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు ఇష్టపడతారు. జైసల్మేర్ 'గోల్డెన్ సిటీ'లోని పురాతన కోటలు, కారవాన్ ఒంటెల సఫారీలు మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. దీనికి తోడు పుష్కర్‌లో జరిగే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'పుష్కర్ ఒంటెల మేళా' రాజస్థానీ సంస్కృతి, కళలకు సరైన చిరునామాగా నిలుస్తుంది.

గోవా: సముద్ర హోరు.. వాటర్ స్పోర్ట్స్ మజా

బీచ్ ప్రేమికులకు నవంబర్ రాకతో గోవా ఒక స్వర్గధామంలా మారుతుంది. వర్షాల సీజన్ ముగియడంతో శృంగారభరితమైన బీచ్ షాక్స్, సాహసంతో కూడిన వాటర్ స్పోర్ట్స్ అన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. పగటిపూట రిలాక్సింగ్ సముద్రపు గాలులు, రాత్రివేళల్లో అలరించే నైట్‌లైఫ్ పార్టీలతో గోవా వైబ్స్ మిమ్మల్ని రీఛార్జ్ చేసేస్తాయి.

కేరళ: గాడ్స్ ఓన్ కంట్రీలో నేచర్ మ్యాజిక్

ప్రకృతి ఒడిలో కాస్త ప్రశాంతతను కోరుకునే వారికి కేరళకు మించిన ఆప్షన్ లేదు. మున్నార్‌లో విస్తరించిన పొగమంచు తోటలు, తేయాకు తోటల నడుమ చేసే ప్రయాణం మదిని తేలికపరుస్తుంది. ఇక వయనాడ్‌లోని పచ్చని అడవులు, పరవళ్లు తొక్కే జలపాతాలు, వైల్డ్ లైఫ్ సఫారీ మీ విహారయాత్రను మరుపురాని అనుభూతిగా మలుస్తాయి.

హిమాచల్ ప్రదేశ్: చల్లటి గాలులు.. మంచు విందు

కొద్దిగా చలిని ఆస్వాదిస్తూ వింటర్ స్నో ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే పర్యాటకులకు హిమాచల్ బెస్ట్ డెస్టినేషన్. మనాళి, స్పితి వ్యాలీ, రోహ్‌తాంగ్ పాస్ ప్రాంతాల్లో నవంబర్ సాయంత్రాలు భలే చల్లగా మారుతాయి. మంచుతో నిండిన పర్వత శ్రేణులు, అడ్వెంచర్ ట్రాకింగ్ ఇష్టపడే యవతకు ఇక్కడ మంచి జ్ఞాపకాలు సొంతమవుతాయి.

ఊటీ & కొడైకెనాల్: దక్షణాది హిల్ స్టేషన్ వైబ్స్

దక్షిణ భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లకుండానే హిల్ స్టేషన్ అనుభూతిని పొందాలనుకునే వారికి తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్ ఎవర్ గ్రీన్ ఛాయిస్. ప్రశాంతమైన సరస్సులు, బొటానికల్ గార్డెన్లు , అక్కడి ప్రత్యేకమైన హోమ్‌మేడ్ చాక్లెట్లతో మీ నవంబర్ ట్రిప్‌ను సరికొత్తగా ప్లాన్ చేసుకోండి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.