Viral Video : ఆసుపత్రా.. లేక అట్టల షాపా? విరిగిన కాలికి షాకింగ్ కట్టు.!
Viral Video : బీహార్‌లోని ప్రభుత్వ వైద్య సేవల అసలు రంగును బయటపెట్టేలా ఒక షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరిగిన ఒక
bihar hospital cardboard bandage fracture treatment viral
Viral Video : బీహార్‌లోని ప్రభుత్వ వైద్య సేవల అసలు రంగును బయటపెట్టేలా ఒక షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరిగిన ఒక బాధితుడికి ప్లాస్టర్ లేదా సరైన సపోర్ట్ బ్యాండేజ్ వేయాల్సింది పోయి, కేవలం అట్టముక్కలతో (కార్డ్‌బోర్డ్) కట్టుకట్టి వేరే ఆసుపత్రికి రెఫర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వైద్య విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగింది..?
ఆగస్టు 3వ తేదీ సాయంత్రం కృష్ణ కుమార్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి గఢ్‌పురా నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా హర్సైన్ వంతెన వద్ద ఒక ఆటోరిక్షా వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ కుమార్ కిందపడిపోవడంతో ఆయన కాలు తీవ్రంగా విరిగింది. విపరీతమైన నొప్పితో అల్లాడుతున్న అతడిని డయల్ 112 పోలీసు వాహనంలో మంఝౌల్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు.
అయితే, అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స పేరిట కృష్ణ కుమార్ విరిగిన కాలుకి ఇరువైపులా అట్టముక్కలు పెట్టి, దానికి తెల్లటి బ్యాండేజ్ చుట్టారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెగుసరాయ్‌లోని సదర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది అట్టముక్కలతో కట్టుకడుతున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై బాధితుడి ఆవేదన
బాధితుడు కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. సదర్ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అక్కడ కేవలం గ్లూకోజ్ (IV ద్రవాలు) ఎక్కించి ప్రాథమిక చికిత్స మాత్రమే అందించారని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) వేయడానికి వారం రోజులు పడుతుందని అక్కడి సిబ్బంది చెప్పడంతో, తీవ్ర భయానికి గురై చివరకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస వైద్య వసతులు లేకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పందించిన ఆసుపత్రి అధికారులు
ఈ ఘటనపై మంఝౌల్ సబ్-డివిజనల్ ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ అభినవ్ ప్రియదర్శి స్పందిస్తూ వింత వివరణ ఇచ్చారు. విరిగిన ఎముక కదలకుండా ఉండటానికి దూది, బ్యాండేజ్ , అట్టముక్కలతో ప్రథమ చికిత్స అందించడం వైద్యపరంగా తప్పేమీ కాదని సమర్థించుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో అస్థిపంజర నిపుణుడు (ఆర్థోపెడిక్ డాక్టర్) కానీ, డ్రెస్సర్ కానీ అందుబాటులో లేకపోవడం వల్లే తాత్కాలికంగా సపోర్ట్ ఇచ్చి పెద్ద ఆసుపత్రికి పంపించామని తెలిపారు.
మరోవైపు, బెగుసరాయ్ సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ కుమార్ ఈ వైరల్ వీడియోపై స్పందించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సగా తాత్కాలిక సపోర్ట్ ఇవ్వడం సాధారణమే అయినప్పటికీ, ఈ నిర్దిష్ట కేసులో అసలు ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. విచారణలో సిబ్బంది అలసత్వం లేదా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Welcome to Bihar!
— Pinki (@TrueTaleTech) August 6, 2026
Where Cardboard is used for medical treatment
A shocking video has come out from a government hospital in Manjhaul, Begusarai (Bihar).
A boy's leg was badly broken in a road accident.
When he went to the hospital hoping for proper care, the doctor did a… pic.twitter.com/GcExCeYwAa




