Creative Ride Goes Viral : బైక్‌నే నందిగా మార్చేశారు.. శివభక్తుల క్రియేటివిటీ వైరల్.!

Creative Ride Goes Viral : ఏటా వైభవంగా జరిగే పవిత్ర కన్వర్ యాత్రలో భక్తుల భక్తిశ్రద్ధలు, వినూత్న ఆలోచనలు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా

G Krishna
Published on: 11 Aug 2026 12:47 PM IST
Creative-Ride-Goes-Viral
X

Creative-Ride-Goes-Viral

Creative Ride Goes Viral : ఏటా వైభవంగా జరిగే పవిత్ర కన్వర్ యాత్రలో భక్తుల భక్తిశ్రద్ధలు, వినూత్న ఆలోచనలు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా అలాంటి ఒక విచిత్రమైన, సృజనాత్మక సంఘటన నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇద్దరు శివభక్తులు తమ సాధారణ మోటార్‌సైకిల్‌ను సాక్షాత్తు పరమశివుని వాహనమైన 'నంది' రూపంలోకి మార్చేసి యాత్రలో ప్రయాణించారు.

బైక్‌కు నంది రూపం ఇచ్చారిలా..

సాధారణంగా ఉండే మోటార్‌సైకిల్‌ను నంది రూపంలోకి మార్చేందుకు ఆ భక్తులు విస్తృతమైన మార్పులు చేశారు. బైక్ బాడీ మొత్తాన్ని తెల్లటి, మెత్తటి ఉన్ని లాంటి వస్త్రంతో (ఫర్) కప్పివేశారు. ఇక వాహనం హెడ్‌లైట్ సరిగ్గా పైన నంది ముఖం, కొమ్ముల రూపాన్ని ప్రత్యేకంగా తయారు చేసి అమర్చారు. దూరం నుంచి చూస్తే నిజమైన నందిపై ప్రయాణిస్తున్నారా అనే భ్రమ కలిగించేలా ఈ బైక్ రూపుదిద్దుకుంది. కన్వర్ యాత్ర ఊరేగింపులో భాగంగా వారు ఈ బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

"ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్"

ఈ వినూత్న దృశ్యాన్ని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేస్తూ "India is not for beginners" అనే క్యాప్షన్‌ను జత చేశారు. భారతీయ భక్తుల సృజనాత్మకతకు, పరమశివునిపై వారికీ ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "భక్తిలో ఇంతటి క్రియేటివిటీ కేవలం భారతదేశంలోనే సాధ్యం" అని కొందరు, "అత్యంత అద్భుతమైన ఆలోచన" అని మరికొందరు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

కన్వర్ యాత్ర ప్రాశస్త్యం

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర ఘనంగా జరుగుతుంది. ఈ యాత్రలో 'కన్వరియాలు'గా పిలవబడే శివభక్తులు మైళ్ల దూరం ప్రయాణించి హరిద్వార్, దేవ్ ప్రయాగ్ వంటి పవిత్ర గంగా తీరాలకు చేరుకుంటారు. అక్కడ నుంచి పవిత్ర గంగాజలాన్ని కావడిలలో సేకరించి, తమ సొంత ప్రాంతాలలోని శివాలయాలకు చేరుకుని పరమశివునికి అభిషేకం చేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story